లడ్డూ వివాదంపై విచారణను సీబీఐకి అప్పగించాలి
లడ్డూ నాణ్యతపై విచారణను సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు
rk roja
లడ్డూ నాణ్యతపై విచారణను సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సుప్రీంకోర్టు సక్రమంగా విచారణ జరిపితే చంద్రబాబు అబద్ధాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని రోజా తెలిపారు. తప్పుజరిగిందా? లేదా? అని తెలియకుండా జగన్ ను హిందువులను దూరం చేయడానికి ఈ రకమైన ఆరోపణలు చేశారన్నారు.
ఉన్నతస్థాయి విచారణ జరిగితే...
ఉన్నతస్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్ధం బయటపడుతుందని సిట్ ను హడావిడిగా ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేశారన్నారు. అందుకే అసలు సంగతి బయటకు రావాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని, అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని రోజా అభిప్రాయపడ్డారు.