Andhra Pradesh : నేడు సిట్ ఎదుటకు నారాయణస్వామి
నేడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం అధికారుల ఎదుట మాజీ మంత్రి నారాయణ స్వామి హాజరు కానున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం అధికారుల ఎదుట మాజీ మంత్రి నారాయణ స్వామి హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఎదుటకు హాజరు కావాలని మాజీ మంత్రి నారాయణస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నారాయణస్వామి నాటి వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో...
లిక్కర్ స్కామ్ లో జరిగిన అవకతవకలు, అవినీతిలో ఆయన ప్రమేయంపై సిట్ అధికారులు నారాయణస్వామిని ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రి కావడంతో పాలసీ రూపకల్పనపై ఆయన పాత్రపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.