ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతుంది
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజ్ ఉద్ధృతంగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రకాశం బ్యారేజీ కు చెందిన అన్ని గేట్లను ఇరిగేషన్ అధికారులు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
కొంత తగ్గుముఖం...
అయితే కృష్ణా,గోదావరి నదుల వరద ప్రవాహం కొంతతగ్గుముఖం పట్టిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 4,71,263 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గోదావరి వరద ఉధృతి కూడా తగ్గుతుంది.ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12,05,753 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిగా వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.