ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు ఎత్తి..దిగువకు నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీ కి వరద నీరు ప్రవేశించడంతో 25 గేట్లు ఎత్తి..దిగువకు నీటి విడుదల చేశారు
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 20,748 క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ 25 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 18,125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను...
ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 2,623 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండిపోయి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి కూడా చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తివసి దిగువకు నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసిన అధికారులు తర్వాత గేట్లను ఎత్తారు.