Sriasailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం కళకళలాడుతుంది

Update: 2025-07-06 03:24 GMT

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం కళకళలాడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో వరద్ ఇన్ ఫ్లో 1,71,208 క్యూ సెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్లం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది.

కుడి, ఎడమ కేంద్రాల్లో...
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,79,8995 టీఎంసీలుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరగడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.


Tags:    

Similar News