పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్ర : పయ్యావుల

అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ పార్టీ కుట్రలు చేస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

Update: 2025-07-08 13:30 GMT

అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ పార్టీ కుట్రలు చేస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జగన్ బ్యాచ్ చేసున్న కుట్రలను దేశ ద్రోహంగా పరిగణించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని పయ్యావుల ఆరోపించారు. ఇందుకు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని పయ్యావుల తెలిపారు.

నిధుల సమీకరణకు...
నిధుల సమీకరణ కోసం ఏపీఎండీసీకి తొమ్మిది వేల కోట్ల బాండ్లపై తప్పుడు ఫిర్యాదు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికి కుట్రలు పన్నారనిప పయ్యావుల తెలిపారు. విదేశాల నుంచి వైసీపీ కార్యకర్త ద్వారా 200 మెయిల్స్ పెట్టించారని అన్నారు. అంతటితో ఆగకుండా లేళ్ల అప్పిరెడ్డితో న్యాయస్థానాల్లో పిటీషన్ దాఖలు చేయించారన్న పయ్యావుల ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో కూడా ఫిర్యాదు చేయంచారని అన్నారు. జగన్ హయాంలో తాకట్టు పెట్టి మరీ రుణాలను తీసుకున్న జాబితా బయట పెట్టాలా? అని పయ్యావుల ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నివర్గాల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.


Tags:    

Similar News