Andhra Pradesh: నేడు సిట్ ఎదుటకు విజయసాయిరెడ్డి
మద్యం కుంభకోణం కేసులో నేడు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఎదుటకు విచారణ నిమిత్తం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు
మద్యం కుంభకోణం కేసులో నేడు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఎదుటకు విచారణ నిమిత్తం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఉదయంయం పది గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాజరు కావాలని ఇప్పటికే నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో విజయసాయిరెడ్డి నేడు ఈ కేసులో విచారణకు హాజరు కానున్నారు.
గత ప్రభుత్వ హయాంలో...
విజయసాయిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం వెనక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారని ఆరోపణ చేసిన నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఆయనను వివరాల కోసం విచారణకు పిలిచారు. ఇప్పటికే కసిరెడ్డికి మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి. నేడు విజయసాయిరెడ్డి చెప్పే వివరాలు విచారణలో కీలకంగా మారనున్నాయి.