నేడు బొండా ఉమ నిరసన దీక్ష

జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేడు ఆందోళన చేయనున్నారు

Update: 2022-02-09 02:06 GMT

విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేడు ఆందోళన చేయనున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. అయితే బొండా ఉమ ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును, మరొక జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రంగా పేరును...
ఇందులో భాగంగా ఈరోజు ఉదయం పదిగంటలకు గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో ఆయన ఆందోళనకు దిగనున్నారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ ధర్నా కొనసాగుతుంది. అయితే బొండ ఉమ దీక్ష సందర్భంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News