కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసులు
నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి
నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులు నమోదయ్యాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ...
కాకాణి గోవర్ధన్ రెడ్డి తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని, చంద్రబాబును తప్పుపట్టడమే కాకుండా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విషయంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు ఈ కేసులకు తాను భయపడబోనని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.