మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట
సరస్వతి పవర్ అండ్ ఇండ్రస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట లభించింది
సరస్వతి పవర్ అండ్ ఇండ్రస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట లభించింది. షేర్ల బదిలి ప్రక్రియను నిలుపుదల చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కాసేపటిక్రితం తీర్పు చెప్పింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించింది. సరస్వతీ పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సరస్వతి పవర్ అండ్ ఇండ్రస్ట్రీస్ నుంచి...
సరస్వతి పవర్ అండ్ ఇండ్రస్ట్రీస్ నుంచి తమ కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియను నిలిపేయాలంటూ గత ఏడాది సెప్టంబరులో జగన్ దాఖలు చేసిన పిటీషన్ వేశారు. వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలని పిటీషన్ లో కోరారు. దీనిపై వాదనలను ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు చెప్పింది.