Earth Quake : ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం

ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది.

Update: 2026-02-19 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారు జామున సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతగా నమోదయింది. వినుకొండకు ఇరవై కిలోమీటర్ల దూరంలో భూమిక పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం స్వల్ప భూకంపమే సంభవించిందని తెలిపారు.

నిద్రలో నుంచి లేచి ఉలిక్కిపడి...
తెల్లవారుజామున భూ ప్రకంపనలు రావడంతో కొందరు నిద్ర లో నుంచి లేచి ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. వినుకొండ, దర్శి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించినట్లు చెబుతున్నారు. అయితే ఇళ్లలో వస్తువులు స్వల్పంగా కదలిక రావడంతో తమకు అనుమానం వచ్చి బయటకు వచ్చామని ప్రజలు చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రత కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News