దీపావళి.. తిరుమలలో తగ్గని రద్దీ
దీపావళికి వరస సెలవులు వచ్చాయి. దీంతో తిరుమలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నేడు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది.
దీపావళికి వరస సెలవులు వచ్చాయి. దీంతో తిరుమలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నేడు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట టీబీసీ వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో ఇప్పుడు క్యూ లైన్ లో చేరిన వారికి మాత్రం మరికొద్ది గంటలు అదనంగా పట్టే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
పెరిగిన హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,565 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,608 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల కాలంలో అత్యధికంగా హుండీ ఆదాయం కూడా నిన్ననే వచ్చింది. శ్రీవారి హుండీ ఆదాయం 6.31 కోట్ల రూపాయలు అని అధికారులు తెలిపారు.