భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్ష
వాతావరణ శాఖ హెచ్చరికలపై హెం. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు
వాతావరణ శాఖ హెచ్చరికలపై హెం. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి అనిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల సూచనలతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
నష్టం జరిగే ప్రాంతాలను గుర్తించి...
ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని వంగలపూడి అనిత సూచించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశం జారీ చేశారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశించడమే కాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.