Andhra Pradesh : నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోనున్న ఏపీ లిక్కర్ కేసు నిందితులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నేడు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు లొంగిపోనున్నారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నేడు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు లొంగిపోనున్నారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితులు సాక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశముందని పిటీషన్ లో పేర్కొన్నారు.
బెయిల్ రద్దు చేయడంతో...
ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఇరువురు వాదనలను విన్న అనంతరం డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు నేడు ఏసీబీ కోర్టులో లొంగి పోనున్నారు.