శ్రీశైల మల్లన్న కల్యాణానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైల మల్లన్న కల్యాణం ఉత్సవానికి భారీగా భక్తుల హాజరయ్యారు
శ్రీశైల మల్లన్న కల్యాణం ఉత్సవానికి భారీగా భక్తుల హాజరయ్యారు. నంది వాహన సేవలో పులకించి పోయారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని భక్తుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలో స్వామివారికి ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి సందర్బంగా ఓసారి, మహాశివరాత్రికి మరోసారి ఈ ఉత్సవాలుంటాయి.
నేడు రథోత్సవం...
శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో పదకొండు రోజుల పాటు జరుగుతాయి. ప్రతి రోజూ వాహన సేవలుంటాయి. మహాశివరాత్రి నాడు ప్రభోత్సవం, నందివాహనసేవ, లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ జరుగుతాయి. మరునాడు రథోత్సవం అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.