నేడు అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ అన్నపూర్ణదేవిగా దర్శనమిస్తుంది.

Update: 2023-10-17 02:39 GMT

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే ఆ రూపంలో దుర్గమ్మ అన్నం పాత్రను ధరించి నేడు దర్శనమిస్తుంది. అన్నపూర్ణదేవి అలంకారంలో దుర్గమ్మను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. క్యూ లైన్లీ భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి.

అన్నం పెట్టే...
ఆదిబిక్షువైన ఈశ్వరుడికి బిక్షపెట్టిన దేవతగా అన్నపూర్ణదేవిని కొలుస్తారు. ఈ రూపంలో ఉన్న దుర్గమ్మను ధ్యానిస్తే.. ప్రార్థిస్తే మేధాశక్తి అభివృద్ధి చెందుతుందంటారు. మధుర భాషణంో పాటు సమయ స్పూర్తి, వాక్‌ శుద్ధి, భక్తి శ్రద్థలు, ఐశ్వర్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు. అమ్మవారు ధరించిన అక్షయ పాత్ర శుభాలను అందిస్తుందని అంటారు. బుద్ధి, జ్ఞానాలను ప్రసాదిస్తుందని చెబుతారు. అందుకే ఈఅన్నపూర్ణ దేవి అలంకారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉదయం నుంచే ఇంద్రకీలాద్రిపై భక్తులు బారులు తీరి ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News