వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వను : పవన్ కల్యాణ్
వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. 2029లో అధికారంలోకి వస్తే తమ అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారని, వాళ్లు అసలు అధికారంలోకి వస్తే కదా? అదీ మేము చూస్తాం అన్నారు. వైసీపీ నేతలపై వ్యక్తిగతంగా తనకు క్ష లేదని, అయితే వారు గత ప్రభుత్వంలో అభివృద్ధిని పట్టించుకోలేదని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలనే చూసుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
అభివృద్ధిని పట్టించుకోకుండా...
రౌడీయిజం, గూండాయిజంతోప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్న పవన్ కనీసం ప్రజలకు తాగు నీరు అందించాలన్న యోచన లేకుండా పనిచేశారన్నార. వెలుగొండ ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, ప్రకాశం జిల్లాలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పవన్ కల్యాణ్ తాగునీరు అందరికీ కల్పించేందుకు జలజీవన్ మిషన్ పథకాన్ని అమలుచేస్తున్నామనితెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, వైద్యం వంటి సౌకర్యాలను కల్పిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.