రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరుగుతన్న మృతుల సంఖ్య

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది.

Update: 2026-03-06 03:19 GMT

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అనేకమంది అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం అన్ని వైద్య ఖర్చులు భరిస్తూ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయివేటు ఆసుపత్రుల్లో వారిని చేర్చింది.

ఏడుగురి పరిస్థితి విషమం...
ఎక్కువ మంది కిడ్నీ సంబంధింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉందని ఘటన జరిగిన రోజునే స్పష్టమయింది. నిన్న రాత్రి మరొకరు మరణించారు. దీంతో రాజమండ్రి కల్తీ పాలు తాగి మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 11 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News