Tiger : రంపచోడవరం మన్యంలోనే పెద్దపులి సంచారం
రంపచోడవరం మన్యంలోనే పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది
రంపచోడవరం మన్యంలోనే పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో పెద్దపులి సంచారం ఉందని తెలుసుకున్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గంగవరం మండలం మొల్లవరం పరిసరాల్లో పెద్దపులి ఉన్నట్లు స్థానికుల సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
రాత్రి వేళ కనిపించిందని...
అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసరాల్లో రాత్రి పెద్దపులి తిరిగినట్లు స్థానికులు గుర్తించారు.దీంతో పెద్దపులి పాదముద్రలను కనుగొనేందుకు అటవీ శాఖ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వర మండలాల పరిధిలోని ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పులి మెడలో రేడియో కాలర్ ద్వారా ఎక్కడ ఉందనేది తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.