ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. ఎందుకంటే?

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు

Update: 2022-08-05 02:28 GMT

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీకెండ్ కు ముందు శ్రావణ శుక్రవారం రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. శ్రీవారి దర్శనానికి 13 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. రేపు, ఎల్లుండి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.

శ్రీవారి ప్రసాదాన్ని....
కాగా నిన్న తిరుమల శ్రీవారిని 62,351 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,473 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.99 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు భక్తుల రాక సందర్భంగా టీటీడీ అప్రమత్తమయింది. వసతి, అన్నప్రసాదాల విషయంలో భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.


Tags:    

Similar News