ఇప్పుడు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ముప్పయి గంటల సమయం పడుతుంది.

Update: 2022-08-15 02:10 GMT

తిరుపతిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ముప్పయి గంటల సమయం పడుతుంది. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి ఆస్థాన మండపం వరకూ క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వచ్చిన భక్తులతో పాటు వరస సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి...
వీరితో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తగా పెళ్లయిన జంటలు కూడా తిరుమలకు రావడంతో రద్దీ పెరిగింది. వీరికోసం అన్నప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వసతి సౌకర్యం విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. వరస సెలవులు కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 92,328 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 52,969 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.36 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News