ఈరోజు రష్ తిరుమలలో ఎంత ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి వీరికి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అంటున్నారు.
సాధారణమే....
నిన్న తిరుమల శ్రీవారిని 72,243 మంది మంది భక్తులు దర్శించుకున్నారు. 32,652 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వెల్లడించారు.