తిరుమలలో కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీ... నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి.

Update: 2022-09-27 03:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే భక్తులు దర్శించుకుంటున్నారు. గంటలోపే స్వామి వారి దర్శనం అవుతుందని తిరుమల తిరుపతి అధికారులు వెల్లడించారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో భక్తులు పెద్దగా రాలేదని తెలిసింది. నవరాత్రుల దృష్ట్యా తిరుమల కొండకు చేరుకునే వారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 52,682 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 15,805 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.57 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పెద్ద శేషవాహనంపై...
బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుడంటంతో స్వామి వారి దర్శన వేళ్లల్లోనూ తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు మార్పులు చేశారు. ఈరోజు నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కేవలం సర్వ దర్శనాలకే అనుమతి ఇచ్చింది. ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై భక్తులకు స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


Tags:    

Similar News