అమ్మకానికి అమరావతి భూములు

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీఆర్డీఏ భూములను విక్రయించాలని నిర్ణయించింది. తొలివిడతగా 248.34 ఎకరాలను విక్రయించనుంది.

Update: 2022-06-25 13:04 GMT

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీఆర్డీఏ భూములను విక్రయించాలని నిర్ణయించింది. తొలివిడతగా 248.34 ఎకరాలను విక్రయించనుంది. ఈ మేరకు జీవో నెంబరు 389 ని ప్రభుత్వం విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధానిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే అందుకు నిధుల కొరత పట్టిపీడిస్తుంది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సి రావడంతో భూముల విక్రయాలకు సీఆర్డీఏ సిద్ధమయింది.

ఎకరం పది కోట్లు....
ఒక్కొక్క ఎకరం పది కోట్ల రూపాయల మేరకు విక్రయించాలని నిర్ణయించింది. వేలం ద్వారా విక్రయించిన 2,480 కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ప్రభుత్వం విడుదల చేసిన 389 జీవోలో బీఆర్ షెట్టీ మెడిసిటీకి కేటాయించిన వంద ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాలను తొలిదశలో విక్రయించాలని నిర్ణయించింది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అనేక షరతులు విధించడంతో భూముల విక్రయంతోనే అభివృద్ధి చేయాలన్న నిర్ణయానికి సీఆర్డీఏ వచ్చింది. ఏడాదికి యాభై ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాలను విక్రయించాలన్నది సీర్డీడీఏ ప్రణాళికను రూపొందించింది.


Tags:    

Similar News