కాకాణి బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్‍పై విచారణను ఈనెల 5కు వాయిదా వేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్‍పై విచారణను ఈనెల 5కు వాయిదా వేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‍పై వాదనలు జరిగాయి. నెల్లూరు ఐదో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరిగాయి. పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిపారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదయింది.
మరో ఇద్దరికి నోటీసులు...
మరోవైపు మైనింగ్ కేసులో మరో ఇద్దరికి పోలీసుల నోటీసులు జారీ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డి అక్రమ మైనింగ్స్ కేసులో మరో ఇద్దరికి నోటీసులు జారీ చేయడంతో వారిని కూడా విచారించాలని నిర్ణయించారు. మైనింగ్ అక్రమంగా జరిపి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కేసు నమోదయింది.వరదాపురానికి చెందిన డి.శ్రీనివాసులురెడ్డి, మురళీకృష్ణారెడ్డిలు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.