సీపీఎస్ పై త్వరగా తేల్చండి

సీపీఎస్ విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో ఏప్రిల్ 4వ తేదీ నుంచి చర్చలు జరపాలని ఆదేశించారు

Update: 2022-03-23 02:23 GMT

సీపీఎస్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో ఏప్రిల్ 4వ తేదీ నుంచి చర్చలు జరపాలని ఆదేశించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం తాను అధికారంలోకి వస్తే తొలగిస్తామని జగన్ తన పాదయాత్రలో ప్రకటించారు. ఆ మేరకు తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇటీవల సమ్మె సందర్భంగా ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లోనూ సీపీఎస్ ప్రధాన అంశమయింది.

ఉద్యోగ సంఘాలతో చర్చించి...
అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కొద్దిరోజుల క్రితం జగన్ హామీ ఇచ్చారు. ఈమేరకు సీపీఎస్ పై ఆయన సమీక్షించారు. సీపీఎస్ పై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉద్యోగ సంఘాలను భాగస్వామ్యుల్ని చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేశామని, మంత్రుల కమిటీ, అధికారులు కలసి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని జగన్ అధికారులను కోరారు.


Tags:    

Similar News