నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివా

Update: 2023-07-04 03:04 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్‌ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

జగనన్న పాలవెల్లువ పథకంలో భాగంగా డెయిరీని నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. 20 ఏళ్లుగా మూతబడి ఉన్న చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను పూర్తిగా తీర్చేసింది ప్రస్తుత ప్రభుత్వం. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని, అమూల్ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం సిఎం జగన్ చిత్తూరులో సోమవారం భూమిపూజ చేయనున్నారు. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా మొదటి దశలో రూ.150 కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ప్లాంటు నిర్మాణం చేపడతారు. దశల వారీగా పాల కర్మాగారం, బటర్ తయారీ విభాగం, పాలపొడి తయారీ విభాగం, UHT విభాగం, చీజ్ తయారీ విభాగం, పన్నీర్, యోగర్ట్, స్వీట్ల తయారీ విభాగాల ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి, అమూల్ ఔట్ లెట్లు, పంపిణీ యంత్రాంగంతో కలుపుకుని పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు. 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది.


Tags:    

Similar News