ఇద్దరూ ఒకే చోట.. ముచ్చట్లు కూడా?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట కలిశారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది

Update: 2021-11-21 08:16 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట కలిశారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ శాసననసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మ మనవరాలి వివాహానికి జగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు.

చాలా రోజుల తర్వాత....
ఇద్దరూ వివాహ వేడుకలో పక్క పక్కనే కూర్చున్నారు. ఇద్దరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఒక ఫంక్షన్ హాలులో ఈ వేడుక జరిగింది. చాలా రోజుల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. జలవివాదాల నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటలు లేవు. అయితే ఈ వివాహ వేడుకలో ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కన్పించింది.


Tags:    

Similar News