ఇద్దరి మధ్య వచ్చింది చంద్రబాబు టాపిక్కేనట

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వివాహ వేడుకలో నేడు కలిశారు. అయితే ఈ సందర్బంగా కొద్దిసేపు వారు మాట్లాడుకున్నారు.

Update: 2021-11-21 14:03 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వివాహ వేడుకలో నేడు కలిశారు. అయితే ఈ సందర్బంగా కొద్దిసేపు వారు మాట్లాడుకున్నారు. వారిద్దరూ ఏ విషయాలపై చర్చించారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ శాసనసభ స్సీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం ఈరోజు శంషాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కొద్దిసేపు ముచ్చటించారు.

ఏపీ అసెంబ్లీలో.....
అయితే మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జిరిగిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. చంద్రబాబు ఏడ్వటంపై కూడా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారంటున్నారు. చంద్రబాబు ఏడవ కుండా ఉండాల్సిందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో కూడా కొంత మాటలను అదుపులో పెట్టాలని జగన్ కు కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద ఇద్దరి మధ్య చంద్రబాబు టాపిక్ ఎక్కువ సేపు నడిచిందంటున్నారు.


Tags:    

Similar News