ఆ దొంగల ముఠా మకాం హైదరాబాద్ లోనే
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దొంగల ముఠా అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దొంగల ముఠా అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ ముఠా మకాం హైదరాబాద్ అని అన్నారు. హైదరాబాద్ లో ఉంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని జగన్ అన్నారు. వీరు చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జగన్ కోరారు. వీరంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని జగన్ అన్నారు. ఎల్లో మీడియాలో ఈ ముఠా ను పెంచి పోషిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. నీతి, ధర్మం, నియమాలు వీరికి లేవే లేవన్నారు.
ఎవరు మంచి చేస్తే....
ప్రభుత్వంపై లేనిపోని ప్రచారాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు. వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకుని అప్పల పాలు చేశారన్నారు. ఎవరు మంచి చేశారనిపిస్తే వారికే మద్దతివ్వమని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని కోరారు. తాను మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలునని జగన్ అన్నారు. పళ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయని అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రతిపక్షం బాక్సులు బద్దలవుతాయని వారికి తెలుసునని అననారు. వారు ఏనాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు.