Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారుల విడుదల చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారుల విడుదల చేశారు. ఉండవల్లి కార్యాయలంలో ఆయన నేడు సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా ఉదయం 11.45 గంటలకు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం, పంటల బీమా వంటి అంశాలపై చర్చించనున్నారు.
బ్యాంకర్లతో సమావేశం...
ఇక ఖరీఫ్ పంటలకు అవసరమైన రుణాలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లతో కూడా సమావేశం కానున్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా వారికి అవసరమైన రుణాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో లంచ్ మీటింగ్ లో చంద్రబాబు పాల్లొంటారు.