ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుహుల్లా
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండి రుహుల్లాను ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారు
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండి రుహుల్లాను ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారు. ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా ఆకస్మిక మృతితో ఈ ఖాళీ ఏర్పడింది. ఖాళీ అయిన స్థానంలో కరీమున్నీసా తనయుడు రుహుల్లాను జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
జగన్ కు కృతజ్ఞతలు....
ఈ సందర్భంగా రుహుల్లా ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రుహుల్లాతో పాటు ఆయన తండ్రి మహ్మద్ సలీమ్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు జగన్ ను కలిశారు.