Chandrababu : జమ్మలమడుగులో ఆటో చంద్రన్న.. డ్రైవర్ తో కలిసి

కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, 2028 డిసెంబరు నాటికి తొలి దశ పనులను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Update: 2025-08-01 11:47 GMT

కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, 2028 డిసెంబరు నాటికి తొలి దశ పనులను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మంచి కార్యక్రమాన్ని చెడగొట్టడం సులువని, నిలబట్టడమే కష్టమని చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంస పాలన చేసిందన్నచంద్రబాబు కేంద్ర పథకాలన్నీనిలిపేశారన్నారు.

హామీ ఇచ్చినట్లుగానే...
తల్లికి వందనం పథకం హామీని నిలబెట్టుకున్నామని, ఏడుగురు పిల్లలు ఒక ఇంట్లో ఉన్నా వారికి పథకాన్ని అందించామని చంద్రబాబు తెలిపారు. గండికోట ప్రాంతాన్ని మరింత అభివృద్ధఇ చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో గండికోట ప్రాజెక్టును ఎన్టీఆర్ ప్రారంభిస్తే తాను పూర్తి చేశానని అన్నారు. కడప జిల్లాలో గత ఎన్నికల్లో పదిసీట్లకు ఏడింటిలో గెలిచామని, ఈసారి పదికి పది సీట్లు గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛను ఇచ్చి ఆటోలో ప్రజావేదికకు చేరుకున్నారు.


Tags:    

Similar News