Chandrababu : వైసీపీని మించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం : చంద్రబాబు
తల్లికి వందనం పథకం కింద ఈరోజు నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
తల్లికి వందనం పథకం కింద ఈరోజు నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 67,27,126 మందికి తల్లికి వందనం పథకం కింద నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రెండు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకూ చదివే విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అమలుచేస్తున్నామని తెలిపారు. జూన్ 26వ తేదీ వరకూ ఈ పథకం అందని వారు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద 8,7445 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామనితెలిపారు.
1,386 కోట్లు డెవలెప్ మెంట్ కు...
ఇందులో 1,386 కోట్లు డెవలెప్ మెంట్ కు కేటాయిస్తున్నామని, మరుగుదొడ్లు పాఠశాలల నిర్వహణ కోసం వినియోగిస్తామని తెలిపారు. జనాభా పెరుగుదలకు ఇటువంటి పథకాలు తోడ్పడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనంపథకం కింద నిధులు అడ్మిషన్లు కాగానే నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు లేనిపిల్లలకు వారి సంరక్షకుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ లో కీలకం తల్లికి వందనం పథకం కీలకమని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లులా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు.
సంక్షేమం - అభివృద్ధి...
అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులను లబ్దిదారులకు మంజూరు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పెంచిన ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పింఛన్ల విషయంలోనూ గత ప్రభుత్వం కంటే రెట్టింపు నిధులను ఇస్తున్నామని తెలిపారు. అమ్మఒడి మార్గదర్వకాలనే పాటిస్తూ ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనంనిధులు ఇస్తున్నామని చెప్పారు. మేనిఫేస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా చేస్తున్నామని చద్రబాబు చెప్పారు.