ఢిల్లీకి బయలుదేరిన వెళ్లిన చంద్రబాబు
అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్ తో సమావేశం అవుతారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
వరస భేటీలతో...
రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మూర్తి మార్గ్-3లో పీవీ సంస్మరణ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి ఏడు గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సీఎం సమావేశం కానున్నారు.