హైకోర్టులో చెవిరెడ్డికి దక్కని ఊరట
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉండగా మధ్యంతర రక్షణ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం కేసులో ఏ39గా ఉన్న మోహిత్‌రెడ్డి ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు తొలగించాలని, ఆరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
వచ్చే వారానికి వాయిదా...
దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై దిగువ కోర్టులో విచారణ ఉండగా మధ్యంతర రక్షణ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.