Liqour Scam Case : చెవిరెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఎలా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తొలి రాజకీయ నేతగా చెవెరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తొలి రాజకీయ నేతగా చెవెరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. ఇప్పటి వరకూ ఏడుగురు అరెస్టయినా రాజకీయేతర వ్యవహారాలను నిర్వహించే వారిని మాత్రమే అరెస్ట్ చేశారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో లిక్కర్ స్కామ్ కేసులో తొలి రాజకీయ నేతను అరెస్ట్ చేసినట్లయింది. డిస్టలరీల నుంచి గత ప్రభుత్వ హయాంలో ముడుపులు స్వీకరించి ఎన్నికల సందర్భంగా కొందరు అభ్యర్థులకు ఇచ్చినట్లు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు తమ విచారణలో కనుగొన్నారు. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారని ఆయనపై ముందుగానే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన నిన్న బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
విజయవాడ పోలీసులు వెళ్లి...
విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకు వచ్చారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేచెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎ 38గా, వెంకటేశ్ నాయుడిని ఎ 34 నిందితులుగా సిట్ అదికారులు చేర్చారు. అభ్యర్థులకు డబ్బులు చేర్చడలో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారని సిట్ దర్యాప్తులో వెల్లడయింది. దీంతో మద్యం కుంభకోణం కేసులో తొమ్మిది మంది అరెస్ట్ అయినట్లు తేలింది.
ఎన్నికలకు ముందు...
గత ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితన అనుచరులు, పీఏ, గన్ మెన్లు, డ్రైవర్ల ద్వారా హైదరాబాద్, బెంగళూరు నుంచి రాజ్ కేసిరెడ్డి ద్వారా డబ్బులు తీసుకుని దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను తీసుకుని తాడేపల్లిలోని ఒక ఇంటికి చేర్చేవారని, అక్కడి నుంచి అభ్యర్థులు విజయం సాధించేందుకు ఖర్చు చేశారని సిట్ అధికారులు తమ విచారణలో వెల్లడయింది. ఈ కేసులో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయనను నిన్న బెంగళూరులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు విచారించిన అనంతరం వారిద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.