Chandrababu : నేడు సీఆర్డీఏపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సీఆర్డీఏ పై సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సీఆర్డీఏ పై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఆర్డీయే పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని సీయం క్యాంప్ కార్యాలయం లో జరగనున్న సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు.
రేపు లండన్ పర్యటనకు...
ఈ సమావేశానికి మంత్రి నారాయణ,సీఆర్డీయే, ఏడీసీ అధికారులు హాజరుకానున్నారు. మరొకవైపు నవంబర్ 1న లండన్ కు చంద్రబాబు బయలుదేరి వెళుతున్నారు. ఐదు రోజులపాటు లండన్ పర్యటనలో చంద్రబాబు ఉంటారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్‌షోలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. నవంబర్ 6న తిరిగి అమరావతికి చంద్రబాబు రానున్నారు.