మన మిత్ర యాప్ పై నేడు ప్రచారం

ఆంధ్రప్రదేశ్ లో మన మిత్ర యాప్ పై విస్తృతంగా ప్రచారం నేడు ప్రారంభమయింది

Update: 2026-01-02 08:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో మన మిత్ర యాప్ పై విస్తృతంగా ప్రచారం నేడు ప్రారంభమయింది. ప్రతి కుటుంబానికి మన మిత్ర యాప్ సేవల అవగాహన కల్పించడం, వాట్సాప్ ద్వారా డిజిటల్ సేవల వినియోగాన్ని పెంచడం కొరకు ప్రతి శుక్రవారం నిర్వహించే “మన మిత్ర” వాట్సాప్ ఆధారిత సేవలపై *డోర్ టు డోర్ కాంపెయిన్ కార్యక్రమం జిల్లాలోని అన్ని గ్రామ & వార్డు సచివాలయాలలో నిర్వహించాలి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి . వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలో, . కవరైన ఇళ్ళ సంఖ్య & నమోదైన పౌరుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి/ వార్డు అడ్మిన్ సెక్రటరీ తగిన సమన్వయం చేసి, తమ పరిధిలోని అన్ని ఇళ్ళు కవరయ్యేలా చూడాలన్నారు.

సేవలపై అవగాహన కల్పించేందుకు..
గ్రామ రెవిన్యూ అధికారి, సర్వే అసిస్టెంట్స్ / వార్డు రెవిన్యూ సెక్రటరీ— రెవెన్యూ, ల్యాండ్ సంబంధిత సేవలపై అవగాహన కల్పించాలి. ఎనర్జీ అసిస్టెంట్స్ / ఎనర్జీ సెక్రటరీలు — విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులపై వాట్సాప్ సేవలను వివరించాలి. అగ్రికల్చర్, హర్టికల్చర్, వెటర్నరి, ఫిషరీస్, ఎ యన్ యం / వార్డు హెల్త్ సెక్రటరీలు — శాఖల వారీగా వాట్సాప్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. . గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ క్యాంపెయిన్ లో పాల్గొనాలి. కావున మండల పరిషత్ అభివృద్ధి అధికారులు/మండల GSWS అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు / అర్బన్ GSWS అధికారులు మీ సచివాలయ సిబ్బందికి అవసరమైన లాజిస్టిక్స్, ప్రచారం, సపోర్ట్ అందించి మన మిత్ర డోర్ టు డోర్ కాంపెయిన్ ఈ శుక్రవారం 02.01.2026 అన్ని సచివాలయలలో చేయించవలసినదిగా ప్రభుత్వం ఆదేశించింది.


Tags:    

Similar News