Amaravathi : అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణ పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
AP amaravathi
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాజధానిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ అసెంబ్లీ భవనానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. అసెంబ్లీ భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన పైల్ ఫౌండేషన్ కు సంబంధించిన ఐరన్ మెటీరియల్ ను ఈ ప్రాంతానికి తసుకు వచ్చారు.
కోర్ క్యాపిటల్ ఏరియాలో...
కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతంలో సందడి మొదలయింది. ముందుగా అక్కడ భూసార పరీక్షలు నిర్వహించి తర్వాత పనులు మొదలు పెట్టారు. ఈ అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం ఎల్ అండ్ టి కంపెనీకి అప్పగించింది. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో వేగంగా పనులు జరుగుతున్నాయి.