ఆ ఇద్దరితో పొత్తు ప్రసక్తి ఉండదు
చంద్రబాబుతో పొత్తు ఉండే అవకాశమే లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
చంద్రబాబుతో పొత్తు ఉండే అవకాశమే లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కుటుంబ వారసత్వ పార్టీలకు తాము దూరమన్నారు. తాము వైసీపీ, టీడీపీలకు సమదూరంగా ఉంటామని చెప్పారు. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయని సోము వీర్రాజు తెలిపారు. తమ బలం పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రెండేళ్లు పనిచేస్తామని తెలిపారు. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండకూడదన్నది తమ పార్టీ విధానమని సోము వీర్రాజు తెలిపారు.
చీప్ లిక్కర్ పై....
తాను చీప్ లిక్కర్ పై చేసిన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకున్నారని సోము వీర్రాజు అన్నారు. పేదల రక్తాన్ని చీప్ లిక్కర్ ద్వారా ప్రభుత్వం పీలుస్తుందని, అందుకే ఆ కుటుంబాలకు ఆర్థిక బాధలను తప్పించేందుకే తాను ఆ విధంగా మాట్లాడానని చెప్పారు. తనను ట్రోలింగ్ చేసే వారు తన మనోభావాలను తెలుసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తప్పుడు విధానాలను అవలంబించదని చెప్పారు. ఒక ఛానెల్ డిబేట్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.