Andhra Pradesh : ఏపీలో పట్టణ వాసులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-12-06 07:29 GMT

కేంద్ర ప్రభుత్వం నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేసింది. పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు 281.89 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

నిధులు విడుదల చేయడంతో...
నగరాలకు రెండో విడత గ్రాంట్ గా ఈ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను సక్రమంగా ఆంధ్రప్రదేశ్ పట్టణంలోని వివిధ పనులకు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా పట్టణాల్లో వీధి లైట్లు, రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు వినియోగించుకోవాలని సూచించింది. ప్రాధాన్యత క్రమంలో నిధులను వినియోగించాలని సూచించింది.


Tags:    

Similar News