పవన్ వ్యాఖ్యలపై ఉండవల్లి ఏమన్నారంటే?
తెలంగాణపై పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు
తెలంగాణపై పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదని ఉండవల్లి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్నప్పటికీ చంద్రబాబు తన వ్యాపారాలు ఏపీకి ఎందుకు తేవడంలేదని ప్రశ్నించారు.
చంద్రబాబు కుటుంబ పరిశ్రమలేవీ...
అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని తాను భావించానన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తారనుకున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.