వైసీపీకి ఇప్పుడు అవి అవసరమా?

వైఎస్సార్ కాంగ్రెైస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండ పడ్డారు.

Update: 2022-01-27 06:12 GMT

వైఎస్సార్ కాంగ్రెైస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండ పడ్డారు. వైసీపీిని క్యాసినో పార్టీగా ఆయన అభివర్ణించారు. గుడివాడకు వెళ్తామంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఒక వైపు ఉద్యోగులు సమ్మెకు దిగుతుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా కొత్త జల్లాల ఏర్పాటు ఇప్పుడు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.

రోడ్లు కూడా వేయకుండా...
రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయకుండా కేవలం ట్రేడింగ్ పార్టీగా మిగిలిపోయిందని సోము వీర్రాజు అన్నారు. ఏపీ సమస్యలను పరిష్కరించాలంటే ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను అందచేస్తామన్నారు. పీఆర్సీ సమస్యలను కూడా తామే పరిష్కరిస్తామని సోము వీర్రాజు తెలిపారు.


Tags:    

Similar News