పవన్ ఆ విషయాలను మర్చిపోయినట్లుంది
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి మాట్లాడే ముందు పవన్ గత అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందని సోము వీర్రాజు కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి మాట్లాడే ముందు పవన్ కల్యాణ్ గత అంశాలను కూడా ప్రస్తావిస్తే బాగుంటుందని సోము వీర్రాజు కోరారు. గత ప్రభుత్వాలు విక్రయించిన సంస్థల గురించి పవన్ మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ సంస్థలను విక్రయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జగన్ ది నియంత పాలన....
అలాగే జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. జగన్ నియంత పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇసుక ధరను విపరీతంగా పెంచడంతో పేద, మధ్యతరగలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఓటీఎస్ పథకాన్ని జగన్ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.