ప్రకాశం బ్యారేజీకి వరదపోటు
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో పొలాలు నీటమునిగాయి. చప్టాలపై వరద ప్రవాహంతో లంక గ్రామాల రాకపోకలకు కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. నక్కపాయ గండి నుంచి పొలాల్లోకి, ఇటుక బట్టీల్లోకి వరద నీరు చేరింది. వరద పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
69 గేట్లు ఎత్తి...
ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో్ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 4.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. 69 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జలవనరుల శాఖ అధికారులు నదీ సమీప పొలాల వైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు.