Andhra Pradesh : కుటుంబానికి పదిహేను లక్షల పరిహారం

కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం అందించింది

Update: 2025-11-03 02:22 GMT

కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం అందించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. బాధితుల నివాసాలకు వెళ్లి వారిని కలిసి. కష్ట సమయంలో ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి చేస్తుందని, ప్రతి కుటుంబం వెన్నంటే నిలబడతామని హామీ ఇచ్చారు.

తక్షణ సహాయం అందించిన ప్రభుత్వం...
మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదిహేను లక్షల రూపాయల చెక్కులను మంత్రులు స్వయంగా అందజేశారు. టెక్కలి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు. పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మూడు లలక్షలు రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఆర్థిక సాయం కూడా త్వరలోనే అందుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.


Tags:    

Similar News