నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవాలు
ఈరోజు నుంచి ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించనున్నారు
ఈరోజు నుంచి ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించనున్నారు. తొలి సారెను ఉద్యోగులతో కలిసి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సమర్పించనున్నారు. ఇంద్రకీలాద్రిపై జులై 24 వరకు ఆషాఢసారె సమర్పణ మహోత్సవాలు జరగనున్నాయని ఈవో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన దేవాలయాల నుంచి ధార్మిక సంఘాల నుంచి సారె అమ్మవారికి సమర్పించనున్నారు.
వారాహి అమ్మవారికి...
ఈరోజు వారాహి అమ్మవారికి పంచ వారాహి మంత్రాలతో హోమాలు ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిలో పంచ వారాహి మంత్రాలతో యాగశాలలో హోమాలు జరుగుతాయి. ఈ నెల రోజుల పాటు దుర్గమ్మను దర్శించుకునేందుకు అధిక మంది భక్తులు తరలి వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లను చేస్తున్నారు.