తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2022-10-04 03:23 GMT

స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

ముగియనున్న వాహన సేవలు...
నిన్న తిరుమల శ్రీవారని 82,815 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,147 మంది స్వామి వారికి తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.05 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు ఎనిమిదో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరగనుంది. నేటి రాత్రితో స్వామి వారి వాహనసేవలు ముగియనున్నాయి.


Tags:    

Similar News