ఏపీ టెట్ ఫలితాలు విడుదల

షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14నే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ .. కొన్ని కారణాలచే ఫలితాల విడుదల..

Update: 2022-09-30 05:56 GMT

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET) ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 58.07 శాతం మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను cse.ap.gov.in/DSE/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఈ పరీక్షకు 4,07,329 మంది రాయగా 58.07శాతం మంది అర్హత సాధించారు.

షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14నే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ .. కొన్ని కారణాలచే ఫలితాల విడుదల ఆలస్యమైంది. ఇదిలా ఉండగా.. 5.25లక్షల మంది టెట్ కు దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో ఏకంగా లక్ష మందికి పైగా పరీక్షలకు దూరమయ్యారు.




Tags:    

Similar News